శ్రీవారి ఆలయ వంశపారంపర్యం ప్రధాన అర్చకుల నుండి సందేశము

సోర్స్: Rama krishna deeksghitulu arhakam.

శ్రీవారి ఆలయ వంశపారంపర్యం ప్రధాన అర్చకుల నుండి సందేశము

ఓం నమో వెంకటేశాయ ......🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
ఆంధ్ర ,#తెలంగాణ# తమిళనాడు#కర్ణాటక రాష్ట్రాలలోని వైఖానస పెద్దలకు సంఘనాయకులకు బ్రాహ్మణ సంఘాలవారికి శ్రీవారి ఆలయ వంశపారంపర్య ప్రధానార్చకులు చేయు విన్నపములు.
🙏🙏🙏

ఇప్పటికే  మాపట్ల, ధర్మం పట్ల మీరందరూ చూపిన ఆదరాభిమానాలకు ధన్యవాదాలు. తెలుపుతున్నాను. తిరుమల శ్రీవారి అర్చకత్వబాధ్యతల విషయంలో  మాకు సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు అనుకూలంగా ఉన్నాయి .వాటిని టీటీడీ ఎప్పటికైనా పాటించాలి. దానికి మేము పోరాడతున్నాము. భావితరాలకు  ప్రధాన అర్చకత్వ బాధ్యతలు ఇవ్వడానికి కూడా మాకు ఎటువంటి సంశయము అహంకారం లేదు. కానీ అనాదిగా వస్తున్న శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుకునే బాధ్యత ముఖ్యంగా మా నాలుగు అర్చక కుటుంబాలపై ఉన్నది. నేను నా సహచరులు నర్సింహదీక్షితులుగారు శ్రీనివాస మూర్తి  దీక్షితులు గారు నారాయణ దీక్షితులు గారు అందరం ఇప్పటివరకు మా శక్తివంచన లేక యధా శక్తి ఆలయాన్ని స్వామివారిని కాపాడతూ వచ్చాము.  ఇప్పటి వరకు అలయంలో మాకు వంశపారంపర్య అర్చకులుగా ఒక గౌరవం ఉంది.అధికారులు ఏమైనా తప్పు నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించే అధికారం  మాకు ఉన్నందున ప్రధాన అర్చకులుగా మా పట్ల మిగిలిన ఉద్యోగులు కూడా వారి పరిధికి మించి ప్రవర్తించే పరిస్థితి లేదు. మేము  మిరాశీ కేసు సుప్రీం కోర్టులో వెనక్కు తీసుకున్న దగ్గర నుండి టీటీడీ లో అధికారుల ప్రవర్తన లో బాగా మార్పు వచ్చింది. గత 8 సంవత్సరాలలో అనేక తప్పు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవాలు వంటి కైంకర్య నిర్వహణకు సంబంధించిన అధికారాన్ని టీటీడీ మా వద్ద నుండి లాగేసుకున్నది.దీనిపై ప్రస్తుతం హైకోర్టు లో వాదనలు జరుగుతున్నాయి. తిరుమల ఆలయం సాధారణమైనది కాదని మీ అందరికి తెలుసు అనేక ఆచార సంప్రదాయాలు ,కట్టుబాట్లు ఈ ఆలయానికి ఉన్నాయి భక్తుల తాకిడి సాకుగా వాటిలో ఎన్నో మరుగున పడిపోతున్నాయి అయినా  ప్రశ్నించేవారు లేరు. ముఖ్యంగా ఆలయం మా పర్యవేక్షణలో కాక ఆలయ కైంకర్యాలకు సంబంధం లేని వ్యక్తుల గుత్తాధిపత్యంలో నడుస్తుంది. వారు ఎటువంటి వారు అంటే అధికారుల మెప్పుకోసం ఎంత దుర్మార్గానికైనా తెగబడుతున్నారు. ఉదాహరణకు ఒక వసంతోత్సవం చేయాలి అంటే మనం గంట సమయం నిర్ధారణ చేస్తే వారు కలుగ జేసుకొని 40నిమిషాల్లో పూర్తిచేసే విధంగా అర్చకుల పక్కనే ఉంటూ వారిని అదిలించి  అధికారుల దగ్గర ఈయన లేకపోతే ఎలా అనే భావన వచ్చేట్టుగా చేసేసారు.సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అర్చన కైంకర్యాల బాధ్యత ఇప్పటికీ ఎప్పటికీ అర్చకుల చేతుల్లోనే ఉండాలి ఉంటుంది కూడా  కానీ ఆ అర్చకుడు అధికారి కూర్చోమంటే కూర్చొవాలి నిల్చోమంటే నిల్చోవాలి అలాంటి అర్చకులు ఉంటే సరిపోతుంది అని టీటీడీ వారి ఉద్దేశ్యము. అడిగేవారు ఉండకూడదు అనేది వారి ఆలోచన. దానికొఱకు అర్చక వేష ధారణతో ఉంటూ  అర్చకులో పరిచారకులో వేదపండితులో తెలియని అవసరమే లేని వ్యక్తులను ఆలయం లో నియమించి అర్చక వర్గాలలో చీలిక తెచ్చే విధంగా రాజకీయాలు చేశారు. అవి ఫలించాయి  ప్రస్తుతం మా వారసులే  మాతోటి అర్చకుల మీద ఆరోపణలు చేయడం చూస్తేనే మీరు ఇది అర్థంచేసుకోవచ్చు. మాకు వ్యక్తిగతంగా ఆర్థికంగా సామాజికంగా ఎటువంటి సమస్యలు లేవు. అలాగే మాకు ఏవైనా సొంత సమస్యలు ఉంటే అవి మేమే పరిష్కారం చేసుకోగలమని మీకందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అర్చకులను ఉద్యోగులుగా మార్చి ఆలయ కైంకర్య విషయాలలో కూడా  అన్నిఅధికారాలు టీటీడీ అధికారులే అమలు పరిస్తే రానున్న రోజులలో ఆలయం వ్యాపార కేంద్రంగా మారే ప్రమాదం ఉంది. దానికి భయపడే మేము ప్రజలముందుకు వచ్చాము. కృష్ణారావు గారు ఈఓ గా ఉండగా సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి మాకు అర్చకత్వం నిర్వహణకు గాను సంవత్సరానికి ఎంతమొత్తం కావాలో అంత ఇస్తాం ఏవిధంగా జీయర్ స్వామివారు వారి పరిచారకుల ద్వారా  స్వామికి వారు చేయదగిన కైంకర్యాలు చేసి గౌరవ సంభావనగా  సంవత్సరానికి 3కోట్లు తీసుకుంటున్నారో అదేవిధంగా 4కుటుంబాల వారు అర్చకత్వ బాధ్యతలు నిర్వహించి (అంటే మేమె చేస్తాము ఎక్కువ మంది అవసరమైతే మన వైఖానస అర్చకులను మేమె తీసుకుంటాం) మేముకుడా గౌరవ సంభావన స్వీకరించి మా ద్వారా అర్చకులకు అందించడం చేయవలసినది అనే  విధానాన్ని చెప్పారు .దానిని మేము  స్వాగతించాము. అప్పుడు మాత్రమే టీటీడీ ఆలయ కైంకర్యాలు మన పర్యవేక్షణ లో జరుగుతాయి . కానీ నేడు ఎవరు పడితే వారు గుత్తాధిపత్యంవహించే పరిస్థితి .అర్చకులను అరవడం తిట్టడం దేవుడికి కైంకర్యాలు సరిగా చేయలేక పోయే పరిస్థితి రోజురోజుకీ పెరిగిపోవడం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం మాకే తెలియకుండా శ్రీవారి ప్రసాదం పోటు మార్చారంటే మీరు అర్ధం చేసుకోండి. గుడి పరాధీనం కాకూడదు. ఇప్పటికీ కూడా అనాదిగా వస్తున్న కొన్ని పద్ధతులు ఆచారాలు గురించి మా నలుగురు అర్చకులకు తప్ప మిగిలిన వాళ్లకు తెలియదు. టీటీడీ వారికి మా వారసులకు కూడా తెలియని అనేక విషయాలు ఉన్నాయి. అవి పరంపరగా ఆలయాన్ని కాపాడాలనే తాపత్రయం ఉన్న మా వారసులలో ఒకరికి మాత్రమే మేము చెప్తాము. కానీ టీటీడీ అధికారులు కొంతమంది వేషాల రాయుళ్లను గుడిలోకి పంపి అర్చక వర్గాలలో చీలిక తెచ్చి  మరొక దీక్షితులు  కింద పనిచేయడానికి మీరు అంగకరించకండి వారు మిమ్మల్ని ఎప్పటికి పైకి రానివ్వడు వాళ్ళు ఒక్కళ్ళే ప్రధానార్చకులా, ఈ విధంగా మాయమాటలు చెప్పించి అర్చకులను నేడు ఉద్యోగులుగా మార్చేశారు. అర్చకత్వం ఉద్యోగమా ?  శ్రీవారి ఆలయ పవిత్రత సంప్రదాయాలు కాపాడే పద్ధతి ఇదేనా?  దీనినే మేము వ్యతిరేకించాము. ఇంతకాలం మా అర్చకులు కూడా ఐకమత్యంగా ఉన్నాము. కానీ నేడు వారికి స్కెలు జీతాలు ప్రధానార్చక అనే పదవులు ఆశ చూపారు.  వాళ్ళ దగ్గర నుండి కైంకర్య నిర్వహణ బాధ్యతలు టీటీడీ అధికారులు స్వీకరించి పదవులు పేర్లు ఇచ్చారు.   వాళ్ళ కుటీలనీతికి వీరందరూ బలి అయ్యారు. దీని వల్ల మాకు వచ్చిన నష్టం ఏమి లేదు. శ్రీవారి ఆలయం రాజకీయాలకు అన్యమతాల తాకిడికి ఇప్పటికే చాలా దెబ్బతింటుంది ఇంకా ఆలయ కైంకర్యాలు కూడా అధికారుల నిర్వహణలోకి  వెళ్తే రేపు దారినపోయేవాడిని తీసుకొచ్చి బ్రహ్మోత్సవాలు చేయిస్తారు. చివరిగా మేము మిమ్మల్ని కోరుతుంది మీరు ఏ ఒక్క అర్చకునికీ ప్రత్యేకం గా మద్దతు ఇవ్వనక్కరలేదు .శ్రీవారి ఆలయ కైంకర్యాలు సరైన పద్ధతిలో జరగాలని దానికొఱకు ఆరాధనాకైంకర్యాలు మొత్తం ప్రధాన అర్చకులు ఆగమసలహా మండలి ధార్మికపరిషత్ వారి సలహాలతో చేయాలని పోరాడండి లేకపోతే ఇప్పటికే సగం పరాధీనం అయిపోయింది సాత్మరైకి వస్తే మనల్ని ఎంత సేపు లోపల ఉంచాలి అనే నిర్ణయం మన దగ్గర ఉండాలి. రాజకీయనాయకులకి ias అధికారులకు ఇవి ఎలా తెలుస్తాయి. రాజకీయాలు గుడిలో చొరబడితే ఎంత ప్రమాదం గ్రహించి పోరాడండి మా అర్చకుల ఐక్యత కొరకు మేము ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అర్చకులను ఉద్యోగులుగా మార్చడం దైవ ద్రోహం.  ఇది మన మతానికి పెద్ద దెబ్బ  . ఇది ప్రపంచంలోనే  మన కు పరమ పవిత్రమైన క్షేత్రమన్న సంగతి మరువకూడదు.

ఇట్లు
శ్రీవారి ఆలయ వంశపారంపర్యం ప్రధాన అర్చకులు

Comments

  1. This is one way if attacking Himduian. If they wanted to do the same let them do the same in church and Nasheed also. They don't have guts. Stop interfering in Hindu rituals. All these half knowledge and half baked officials. Please keep away. It is not good for you for your family. Are you allowing government in your family.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శబ్దమంజరి ( ప్రవేశ వర ప్రవర అన్ని ఆగమాలు వారికి ) & సిలబస్

వైఖానస ఆగమం ప్రవేశ పరీక్షా సార సంగ్రహం

ప్రవేశ వారికి ఉపయోగపడే సమాచారం