వంశపారంపర్యం అర్చకత్వం అంటే??

వంశపారంపర్యం అర్చకత్వం అంటే ?? By : శ్రీధర్ అంగర మనం గత కొన్ని రోజుల నుండి వంశపారంపర్యం అనే విషయం గురించి చూస్తూనే ఉన్నాం. వంశపారంపర్యం అంటే చాల మందికి తెలుసు కాని వంశపారంపర్య అర్చకత్వం అంటే చాల తక్కువ మందికి తెలుసు. అసలు వంశపారంపర్య అర్చకత్వం అంటే ఎమిటొ దీని ద్వారా చాల క్లుప్తం గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వసాధారణంగా వంశపారంపర్యం అనే పదం మన నిజ జీవితం లో చాలా సార్లు వి౦టాము ఉదా : వంశపారంపర్య ఆస్తి, వంశపారంపర్యం అలవాట్లు & ఆచారాలు & వ్యాధులు & వ్యాపారం etc... అలాగే వంశపారంపర్యం వృత్తి కూడా ఒకటి. అటువంటి వంశపారంపర్య వృత్తులలో అర్చకత్వం ఒకటి. సాదారణంగా మిగిలిన వృత్తుల వారు తమ కుటుంబం పెద్దలు నుండి లేక తండ్రి నుంచి ఆ వృత్తి ని సాధన చేసి అందులో ఉత్కృష్ణులు అయ్యి దానిని కొనసాగిస్తారు. కాని ఈ అర్చకత్వనికి సంబంధించి ఒక విశేషం ఉంది. ఆలయం యొక్క ప్రతిష్టా కార్యక్రమ సమయం లొ ఒక సాధారణ రాతి విగ్రహానికి కళలను ఆవాహన చేసి మహోన్నతమైనటువంటి అర్చన స్వరూపంగా మలిచే క్రమం లొ మొత్తం స్వామి వారి యొక్క స్వరూపాన్ని ( విగ్రహాన్ని ) 12 విభాగాలు గా చేసి ఒక్కో విభాగం లొ 4 కళ లను ఆవాహన చెయ్యడం జరుగుతుంది . చివరిగా 12 వ భాగమైన పాదాలు వద్ద ఆఖరి నాలుగు కళ లను ఆవాహన చేస్తారు. ఈ విధంగా పాదాలు వద్ద చేసిన ఆవాహన లోంచి ఒక భాగాన్ని తీసుకుని దాన్ని 4 విభాగాలు గా చేసి మళ్లీ అందులో ఒక భాగాన్ని అర్చకుడి లొకి ఆవాహన చెయ్యడం జరుగుతుంది. ఈ ప్రక్రియ వల్ల కేవలం ఆ యొక్క అర్చక సంతనానికి మాత్రమే స్వామి వారికి అర్చన చేసే అవకాశం ఉంది. వేరే ఏ అర్చకుడి కి అర్చన చేసే అవకాశం లేదు ఒక వేళ చేసిన అది ఫలితం ఉండదు, నిరుపయోగం. కాబట్టి వంశపారంపర్యం అర్చకులను తీసే సే హక్కు ఎవరికి లేదు. ఇది వంశపారంపర్యం అర్చకత్వం వెనుక ఉన్న రహస్యం...

Comments

Popular posts from this blog

శబ్దమంజరి ( ప్రవేశ వర ప్రవర అన్ని ఆగమాలు వారికి ) & సిలబస్

వైఖానస ఆగమం ప్రవేశ పరీక్షా సార సంగ్రహం

ప్రవేశ వారికి ఉపయోగపడే సమాచారం